ఇస్లాం పవిత్ర నగరం మక్కాలో తొలిసారిగా వైమానిక ముప్పు హెచ్చరికలు జారీ అయ్యాయి. సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. సెప్టెంబర్ 15న మక్కాకు దక్షిణంగా వచ్చిన ఓ హౌతీ డ్రోన్‌ను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుని ధ్వంసం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ డ్రోన్ మక్కా నిషేధిత గగనతలంలోకి ప్రవేశించే ముందే కూల్చివేసినట్లు సమాచారం. అయితే మక్కాను లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన వార్తలను హౌతీలు ఖండించారు.