కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు.. కన్ని మాస పూజల కోసం ఈ సాయంత్రం తెరచుకోనున్నాయి. ఈ సాయంత్రం 5: 30 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు మేల్శాంతి ఈడీ ప్రసాద్ నంబూద్రి, ప్రధాన తంత్రి బ్రహ్మదత్తన్ సమక్షంలో గర్భగుడి తలుపులను శాస్త్రోక్తంగా తెరిచి దీపారాధన చేయనున్నారు. గురువారం తెల్లవారు జాము నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు కన్ని మాస పూజలు ముగిసిన అనంతరం ఈ నెల 21వ తేదీ ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేయనున్నారు.