అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో నకిలీ మద్యం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్చార్జి జయచంద్రరెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి మంగళవారం రోజున మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. నకిలీ మద్యం కేసులో వీరికి ముందస్తు బెయిల్ లభించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. కోర్టు వీరిద్దరికీ సెప్టెంబర్ 28 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.