జైలులో పెట్టినా, చంపినా భయపడను.. షేక్ హసీనా
తాను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తప్పకుండా తిరిగి వెళ్తానని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు. అక్కడికి వెళ్లిన తర్వాత తనను అరెస్టు చేస్తారని, లేదా చంపొచ్చని.. అయినా తాను వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు. షేక్ హసీనా రెండేళ్లుగా ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. బుధవారం వర్చువల్‌గా మీడియాతో సమావేశమయ్యారు. తాము ఎన్నో ఏళ్లుగా నిర్మించిన బంగ్లాదేశ్ ఇబ్బందుల్లో ఉందని, దీనికోసమా 1972లో 30 లక్షల మంది త్యాగం చేశారు అంటూ హసీనా ఆవేదన వ్యక్తం చేశారు.

