మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) సీఈవో మార్క్ జుకన్‌బర్గ్ క్షమాపణ చెప్పారు. డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తి, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కంటెంట్ (సీఎస్‌ఏఎం), ప్లాట్‌ఫామ్ నిర్వహణలో పొరపాట్లను అంగీకరించిన మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మెటా ప్రతినిధులు తమ నిర్వహణలో జరిగిన తప్పులను అంగీకరించి విచారం వ్యక్తం చేసినట్లు తెలిపాయి.