మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీక గా మారిందని చెప్పుకొచ్చారు. గత 27 నెలల పాలనలో రైతులకు గిట్టుబాటు ధర, భరోసా, ప్రభుత్వ అండ ఏదీ దక్కలేదని ఆరోపించారు. రైతుల పక్షాన తాము నిలబడతామని హామీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయరో చూస్తామని… వారి కోసం మొదలు పెట్టిన పోరాటం ఇక ఆగదని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు.