ఉత్తర భారతదేశంలో నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకు తోడు, అల్పపీడన ద్రోణి హిమాలయ పాదప్రాంతాల వైపు కదలడంతో ఉత్తరాదిని ముసురు కమ్మేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు నెక్స్ట్ రెండు రోజులు చాలా క్లిష్టమైనవని హెచ్చరించింది. పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది. కొండ కోనల్లో ఆకస్మికంగా పిడుగులతో కూడిన వానలు పడే సూచనలున్నాయి. మైదాన ప్రాంతాలైన యూపీ, బీహార్లలో నదులు పొంగిపొర్లుతూ ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది.