కూటమి ప్రభుత్వం వచ్చాక నష్టపోయామని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీగానీ ఇక్కడికి రాలేదన్న రైతులు. 98 శాతం పొగాకును రూ.170కే కొంటున్నారు. మీరు వస్తున్నారని రూ.10 పెంచారు. వైఎస్సార్సీపీ హయాంలో కేజీ పొగాకు రూ.365 ఉంటే ఇప్పుడు రూ.260 మాత్రమే.కేజీ పొగాకుకు రూ.70 నష్టపోతున్నాం.పొగాకు కొనే దాని కంటే రిజక్ట్ చేసేదే ఎక్కువ. ఎకరానికి రూ.3లక్షల పెట్టుబడి.. గిట్టుబాటు రావడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో లోగ్రేడ్ పొగాకు కూడా కొనేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అని అన్నారు.