భారతదేశంలో తొలి పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రారంభంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్బీఐ పాలిమర్ నోట్లను భారతీయ పరిస్థితుల్లో ఎలా పనిచేస్తున్నాయో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా కొనసాగితే,తక్కువ విలువైన ప్లాస్టిక్ నోట్లను ప్రవేశ పెట్టె అవకాశం వుంది. పాలిమర్ బ్యాంక్ నోట్లు మూడు దశాబ్దాలుగా అనేక దేశాలలో ఉపయోగంలో ఉన్నాయని, సాధారణంగా కాగిత నోట్ల కంటే మూడు నుండి నాలుగు రెట్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.