స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్(SpaceX Rocket) అవశేషం ఒకటి ఇవాళ చంద్రుడిపై కుప్పకూలింది. శాస్త్రవేత్తలు ఇంకా ఈ ఘటనను ద్రువీకరించలేదు. జనవరి 2025లో ఆ రాకెట్‌ను ప్రయోగించారు. అయిదు అంతస్తుల ఎత్తున్న సైజులో ఆ రాకెట్ శకలం ఉంటుందని భావిస్తున్నారు. భూమిపై ఆ రాకెట్ ముక్క బరువు సుమారు 4వేల కేజీలు ఉంటుంది. ఐన్‌స్టీన్ క్రాటర్ వద్ద స్పేస్ఎక్స్ శకలం కూలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాకెట్ కుప్పకూలండం వల్ల చంద్రుడిపై భారీ స్థాయిలో లోయ ఏర్పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు