తెలంగాణలో ‘డయల్ 100’ స్థానంలో ఇకపై అన్ని ఎమర్జెన్సీ సేవలకు ఒకే నంబర్ ‘112’ అందుబాటులో ఉండనుంది. పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలకుగాను ‘డయల్ 112’ ఎమర్జెన్సీ నంబర్‌ను డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. డయల్ 112 వచ్చినపుడు పోలీసులు ఆ కాల్ ఎట్టి పరిస్థితుల్లోను తిరస్కరించడానికి వీల్లేదు.. డయల్ 112 కాల్ రాగానే కాలర్ లొకేషన్ కోసం అడ్వాన్స్ టూల్స్ వాడుతున్నాము. యువ IPSలు, AI టెక్నాలజీ వాడే వారిని ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నామని డీజీపీ స్పష్టం చేశారు.