కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది.యాద్గిర్ జిల్లా కడేచూర్-బడియాలా పారిశ్రామిక ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీక్ అయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.మృతులను విక్రమ్, సంజయ్, గణేష్‌గా గుర్తించారు. సంజయ్, విక్రమ్‌లది మధ్యప్రదేశ్‌లోని కత్ని జిల్లా కాగా.. గణేష్‌ది తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా. అనంతపురం జిల్లాకు చెందిన హేమంత్, శివకుమార్ అనే మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.