రష్యా సైన్యం ఉపయోగిస్తున్న శక్తివంతమైన ఉపిర్ ఎఫ్పీవీ డ్రోన్లను తయారుచేసే ‘ఉరల్డ్రోన్జావోడ్’ కంపెనీ సీఈవో వ్లాదిమిర్ త్కాచుక్ లక్ష్యంగా భారీ పేలుడు సంభవించింది. యెకాటెరిన్బర్గ్ సమీపంలోని బోల్షోయే ఇస్తోక్ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు వెళ్తుండగా ఈ విస్పోటనం జరిగింది. కారు కింద ముందే అమర్చిన పేలుడు పదార్థాలు పేలిపోవడంతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. వ్లాదిమిర్ త్కాచుక్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చి వైద్యం అందిస్తున్నారు.