జార్ఖండ్లో ఇటీవల జరిగిన జేపీఎస్సీ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ అక్కడి విద్యార్థి సంఘాలు గత నెల 25 నుంచి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతోపాటు మరో ఐదుగురు విద్యార్థులు రాజధాని రాంచీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.ఈ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఈ నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం స్పందించింది. విద్యార్థి నేతలతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది.