జులై 3 నాటికి గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటు చేయాలి: పవన్ కల్యాణ్
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జులై 3వ తేదీ నాటికి ఈ సొసైటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలన్నారు. గ్రీనింగ్ సొసైటీకి సంబంధించిన నిబంధనలు, నియామకాలు, విధివిధానాల ప్రతిపాదనలన్నీ కచ్చితంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కి అనుగుణంగానే ఉండేలా సుకోవాలని చెప్పారు. గురువారం వెలగపూడి సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.

