IIT హైదరాబాద్‌లో CSE ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే రూ. 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో సరికొత్త ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ ఆప్టివర్ లో ఎడ్వర్డ్ రెండు నెలల పాటు సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేశాడు. ఆరు వారాల ప్రాజెక్ట్ వర్క్‌లో అతని ప్రతిభను చూసి ఫిదా అయిన కంపెనీ మేనేజ్‌మెంట్.. క్యాంపస్ ఇంటర్వ్యూల కంటే ముందే ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ లో ఈ భారీ ప్యాకేజీని ప్రకటించింది