ఏపీ మద్యం స్కాంలో సుదీర్ఘంగా దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్‌ను గురువారం అరెస్టు చేశారు. ఇటీవల ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ జరిపిన సోదాల అనంతరం లభించిన కీలక ఆధారాల ప్రాతిపదికన ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరిగిన మద్యం టెండర్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ గతేడాది చి విచారణ జరుపుతోంది.