తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా మరో కీలక అడుగు వేసింది. కేబినెట్ సమావేశాలను పూర్తిగా పేపర్ లెస్ గా నిర్వహించేందుకు తెలంగాణ డిజిటల్ కేబినెట్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త విధానంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంత్రులకు ప్రత్యేక ట్యాబ్లను అందజేశారు.ఇకపై కేబినెట్ సమావేశాలకు సంబంధించిన ఎజెండాలు, నోట్స్, కీలక పత్రాలు అన్నీ డిజిటల్ రూపంలోనే అందుబాటులో ఉండనున్నాయి.