మే నెలలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల వేధింపులు తాళలేక క్రాంతికుమార్ అనే మరో యువకుడు సీఐ పేరును మరణవాంగ్మూలంలో ప్రస్తావిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడని జగన్ గుర్తుచేశారు. మే 9న సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లిన కొడుకు కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన తల్లిని కొడుకు ఫోటోకు దండ వేసుకో అని సీఐ హేళన చేశారు.తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయి కానీ, పోలీసులే చేతుల్లోకి తీసుకుని గోళ్లు పీకి, చిత్రహింసలు పెట్టి చంపేస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.