ఉత్కంఠగా సాగిన ఝార్ఖండ్ రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానం నుంచి బీజేపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వాని గెలుపొందారు. మరో సీటును జేఎంఎం సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రం షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఏకైక అభ్యర్థి ప్రణవ్ ఝా.. పరిమళ్ చేతిలో ఓడిపోయారు. ఇండియా బ్లాక్ మద్దతు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయి, బీజేపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ గెలవడానికి క్రాస్ ఓటింగే కారణమని తెలుస్తోంది.