సింగూరు జలాశయం కబ్జాకు గురవుతోందని, మంత్రి దామోదర రాజనర్సింహ బావమరిది అనిల్ రెడ్డి సింగూరు జలాశయంలోనే భూ కబ్జా చేస్తున్నారని బిఆర్‌ఎస్ నేత మాజీ ఎంఎల్‌ఎ చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. దీనిపై పిర్యాదు చేస్తే ఎకరం మాత్రమే కబ్జా అయిందని అధికారులు అంటున్నారని అన్నారు. కానీ, అనిల్ రెడ్డికి సింగూరు జలాశయం దగ్గర ఫాం హౌస్ ఉందని చెప్పారు.నిజాం కాలంలో కట్టిన కుంటలను లెవెల్ చేసి కబ్జా చేశారని, దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాధారాలను కలెక్టర్‌కు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.