loader

భవనంలో భారీ పేలుడు.. 45 మంది మృతి.. 70 మందికి గాయాలు

ఈశాన్య మయన్మార్ లో ఆదివారం మధ్యాహ్నం ఓ భవనంలో గనుల తవ్వకాల కోసం నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో మరో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ పేలుడు తీవ్రత వల్ల దాదాపు 100కు పైగా నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గనులు, క్వారీ తవ్వకాల కోసం ఈ భవనంలో ‘జెలిగ్నైట్’ అనే పేలుడు పదార్థాలను నిల్వ […]

యూత్ కాక్రోచ్‌లను ఫాలో అవుతుంది.. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

మంచి వార్తలను మీడియా సంస్థలు దేశ ప్రజలకు మరింత ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉందని.. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, మంచి పనులు, సక్సెస్ స్టోరీలను మీడియా ఎక్కువగా చూపించకపోతే.. యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మంచి విషయాలను మీడియా బలంగా ప్రచారం చేయాలని.. లేకపోతే యువత ఆసక్తి కోల్పోయి బొద్దింకను ఫాలో అవుతుంది అంటూ మలయాళ దినపత్రిక దీపిక 140వ వార్షికోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు […]

ఫైనల్లో గిల్, సుదర్శన్ ఫ్లాప్‌.. ఆరెంజ్ క్యాప్ వైభవ్‌దే..!

పంతొమ్మిదో సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌ విజేత ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది. క్రీజులో ఉన్నంతసేపు ఊచకోతను తలపించే బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన వైభవ్ సూర్యవంశీకి ఈ టోపీ దక్కడం లాంఛనమే. ఎందుకంటే.. ఫైనల్‌కు ముందు వైభవ్‌కు గట్టి పోటీనిచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ రేసులో వెనకబడ్డారు. సీజన్ ఆసాంతం విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రపంచస్థాయి బౌలర్లను భయపెట్టిన ఈ చిన్నోడు 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడమే అందుకు కారణం

పుట్టుక, చావు బీఆర్ఎస్‌తోనే.. హరీశ్ రావు భావోద్వేగ వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికల సమయానికి బీజేపీలో చేరతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. తన జీవితమంతా కేసీఆర్ వెంటేనని.. తన పుట్టుక, ప్రయాణం అంతా బీఆర్ఎస్ నే అని వందసార్లు చెప్పాను, మళ్లీ చెబుతున్నానని స్పష్టం చేశారు. నాలుగు పార్టీలు మారిన ఆయన నా గురించి మాట్లాడతారా? రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు” అంటూ ఫైర్ అయ్యారు. పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డికి తన గురించి […]

ఇరాన్ వార్ లో చైనా ? అమెరికా ఎఫ్ 15 ఫైటర్ జెట్ కూల్చివేత..!

గత నెలలో నైరుతి ఇరాన్ గగనతలంలో కూలిపోయిన యూఎస్ ఎఫ్-15 యుద్ధ విమానాన్ని చైనాలో తయారైన భుజంపై నుండి ప్రయోగించే క్షిపణి ఢీకొట్టి ఉండవచ్చని తాజా నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ద సమయంలో చైనా ఇరాన్‌కు అదనపు సైనిక సహాయం, స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నాలజీ, సుదూర రాడార్ వ్యవస్థలు అందించిందని ఎన్‌బీసీ న్యూస్ తెలిపింది. దశాబ్దాలలో తొలిసారిగా అమెరికా యుద్ధ విమానం శత్రువుల దాడిలో కూలిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ జెట్‌లో ఇద్దరు […]

వేగంగా దూసుకెళ్లి కంటెయినర్‌ లారీని ఢీకొన్న ఆటో.. ఆరుగురు కూలీలు దుర్మరణం..!

కర్ణాటక సరిహద్దుల్లో ఇవాళ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాగేపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.

900 ఏళ్ల నాటి చారిత్రాత్మక లెబనాన్‌ బ్యూఫోర్ట్ కోట ఇజ్రాయెల్ వశం..!

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని అత్యంత వ్యూహాత్మకమైన, సుమారు 900 ఏళ్ల పురాతన చారిత్రాత్మక బ్యూఫోర్ట్ కోటను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. దానికి ఆనుకుని ఉన్న కీలకమైన కొండను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) అధికారికంగా ప్రకటించాయి. ఇరాన్ మద్దతుతో నడుస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపునకు ఇది ఒక ప్రధాన స్థావరమని, ఇక్కడి నుంచే వారు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారని సైన్యం స్పష్టం చేసింది.

చరిత్ర సృష్టించిన సాత్విక్ – చిరాగ్.. భారత తొలి డబుల్స్ జంటగా రికార్డు..!

గత సీజన్ నుంచి అంతర్జాతీయ టోర్నీలో దుమ్మురేపుతున్న సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం చరిత్ర సృష్టించింది. ఏళ్లుగా భారత డబుల్స్ క్రీడాకారులను ఊరిస్తున్న సింగపూర్ ఓపెన్‌ ట్రోఫీని ఈ జోడీ గెలుపొందింది. ఆదివారం ఫైనల్లో టాప్ గేర్‌లో ఆడిన భారత జంట ఫైనల్లో ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ(ఇండోనేషియా)ను మట్టికరిపించి టైటిల్‌ను కొల్లగొట్టింది. తద్వారా రెండేళ్లలో రెండో ట్రోఫీని సాధించింది సాత్విక్ – చిరాగ్ జోడీ.

భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు, వాతావరణ శాఖ జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ కారణంగా, కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి, మార్గం సురక్షితమని నిర్ధారించిన తర్వాత యాత్రను తిరిగి ప్రారంభిస్తారు. గత రాత్రి నుంచి రుద్రప్రయాగ్ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కేదార్‌నాథ్ ట్రెకింగ్ మార్గంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం, ఇతర ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని గర్హ్వాల్ […]

విషాదం.. వైద్యుల నిర్లక్ష్యంతో 18 రోజుల పసికందు చేయి తొలగింపు!

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందు ప్రాణాపాయ స్థితిలో తన ఎడమ చేతిని కోల్పోయింది. వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన రేణుకకు కవలలు జన్మించగా, ఒక శిశువు బరువు తక్కువగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు, నర్సులు క్యాన్యులా సరిగ్గా అమర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శిశువు చేతికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. నొప్పి భరించలేక పసికందు ఏడుస్తున్నా, డాక్టర్లు పట్టించుకోకుండా ఆయింట్‌మెంట్ రాసి చేతులు దులుపుకున్నారు. చివరకు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిలోఫర్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON