మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని అత్యంత వ్యూహాత్మకమైన, సుమారు 900 ఏళ్ల పురాతన చారిత్రాత్మక బ్యూఫోర్ట్ కోటను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. దానికి ఆనుకుని ఉన్న కీలకమైన కొండను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) అధికారికంగా ప్రకటించాయి. ఇరాన్ మద్దతుతో నడుస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపునకు ఇది ఒక ప్రధాన స్థావరమని, ఇక్కడి నుంచే వారు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారని సైన్యం స్పష్టం చేసింది.