గత నెలలో నైరుతి ఇరాన్ గగనతలంలో కూలిపోయిన యూఎస్ ఎఫ్-15 యుద్ధ విమానాన్ని చైనాలో తయారైన భుజంపై నుండి ప్రయోగించే క్షిపణి ఢీకొట్టి ఉండవచ్చని తాజా నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ద సమయంలో చైనా ఇరాన్‌కు అదనపు సైనిక సహాయం, స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నాలజీ, సుదూర రాడార్ వ్యవస్థలు అందించిందని ఎన్‌బీసీ న్యూస్ తెలిపింది. దశాబ్దాలలో తొలిసారిగా అమెరికా యుద్ధ విమానం శత్రువుల దాడిలో కూలిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ జెట్‌లో ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.