గత సీజన్ నుంచి అంతర్జాతీయ టోర్నీలో దుమ్మురేపుతున్న సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం చరిత్ర సృష్టించింది. ఏళ్లుగా భారత డబుల్స్ క్రీడాకారులను ఊరిస్తున్న సింగపూర్ ఓపెన్ ట్రోఫీని ఈ జోడీ గెలుపొందింది. ఆదివారం ఫైనల్లో టాప్ గేర్లో ఆడిన భారత జంట ఫైనల్లో ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ(ఇండోనేషియా)ను మట్టికరిపించి టైటిల్ను కొల్లగొట్టింది. తద్వారా రెండేళ్లలో రెండో ట్రోఫీని సాధించింది సాత్విక్ – చిరాగ్ జోడీ.

