అసెంబ్లీ ఎన్నికల సమయానికి బీజేపీలో చేరతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. తన జీవితమంతా కేసీఆర్ వెంటేనని.. తన పుట్టుక, ప్రయాణం అంతా బీఆర్ఎస్ నే అని వందసార్లు చెప్పాను, మళ్లీ చెబుతున్నానని స్పష్టం చేశారు. నాలుగు పార్టీలు మారిన ఆయన నా గురించి మాట్లాడతారా? రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు” అంటూ ఫైర్ అయ్యారు. పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.