loader

ఒకరిని జైల్లో వేస్తే జనసేన ఎదుగుతుందా?

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. “ఒకరిని జైల్లో వేస్తే జనసేన పార్టీ ఎదుగుతుందా?” అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎవరిని జైల్లో వేయాలో చెప్పాల్సిన అవసరం తనకు లేదని, తప్పు చేసిన వారిని శిక్షించడానికి దేశంలో జడ్జిలు, న్యాయస్థానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తాను ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే తప్ప, ఎవరినో జైల్లో పెట్టించడానికి కాదని […]

గాంధీలో జూడాల ధర్నా

గాంధీ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై రోగి సహాయకురాలు దాడి చేయడంతో జూనియర్ డాక్టర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. జూనియర్ వైద్యుడు శివశంకర్‌ రోగి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు చెప్తున్న సమయంలో మౌనిక మెర్లిన్ నిరంతరాయంగా వీడియో కాల్‌లో మాట్లాడుతుండటంతో డాక్టర్ ఆమెను వారించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె అసభ్య పదజాలంతో దూషిస్తూ వైద్యుడిని ఫోన్‌లో చిత్రీకరించడం ప్రారంభించింది. ఈ క్రమంలో వైద్యుడు ఆమె ఫోన్‌ను తీసుకుని డ్యూటీ సిస్టర్‌కు అప్పగించగా, ఆగ్రహించిన మౌనిక మెర్లిన్ […]

ఒంగోలు జిల్లా జనసేన పార్టీ కమిటీ రద్దు…రియాజ్‌తో సహా అందరూ తొలగింపు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జనసేన పార్టీ నాయకుల పార్టీ నియమాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న తీరుపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌తో సహా, జిల్లా కార్యవర్గ సభ్యులతో కూడిన కమిటీ రద్దు తక్షణం అమలులోకి వస్తుంది. క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, పార్టీ నియమాలను దాటిన వారందరి నుంచి వివరణ తీసుకోవాలని కేంద్ర కార్యాలయానికి […]

కోయంబత్తూరు బాలిక హత్య కేసుపై నవ్విన టీవీకే మంత్రి కీర్తన.. భగ్గుమన్న బీజేపీ!

ఒక అధికారిక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కీర్తన బాలిక హత్య గురించి ప్రశ్నించగా, కీర్తన పరిపాలనాపరమైన ప్రశ్నలకే సమాధానం ఇస్తానని చెబుతూ నవ్వారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత వినోజ్ పి. సెల్వం డీఎంకే ప్రభుత్వంపై మండిపడ్డారు, పదేళ్ల చిన్నారి దారుణంగా హత్యకు గురైతే.. ఒక మహిళా మంత్రి అయి ఉండి కూడా ఆ ప్రశ్నకు నవ్వుతూ సమాధానం దాటవేయడం అత్యంత సిగ్గుచేటు. ఆమె ఈ ఘోరాన్ని చాలా తేలికగా తీసుకున్నారు” అని ఆయన […]

అలాంటి నదులను మన చేతులారా చంపేస్తున్నాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

‘జీవ నదులను మన చేతులారా చంపేస్తున్నాం. నదులను మృత నదులుగా మారిస్తే భవిష్యత్తు ఉండదు’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.‘గోదావరి కాలుష్య నివారణకు అంతర్ శాఖల (జిల్లా) టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కాలుష్య నియంత్రణ చర్యలకు రూ.100 కోట్లు బడ్జెట్ నిధులు కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై పీసీబీ, అటవీ- ర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, జిల్లా […]

హైవేపై బీభత్సం.. ట్రక్ ను వరుసగా ఢీకొన్న ఏడు కార్లు

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై వాహన శ్రేణిలో టైర్ పేలి పోవడంతో ఒక్కసారిగా ట్రక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వెనుక వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కార్లకు యాక్సిడెంట్ అయింది. కార్ల వెనుక వచ్చిన కొబ్బరి బొండాల లారీ కార్లను పక్క నుండి ఢీ కొట్టుకుని పొలాల్లోకి దూసుకెళ్లింది.పలు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రికి […]

జూలూరుపాడులో ఈదురుగాలుల బీభత్సం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలోని వెంగన్నపాలెం, వినోబానగర్, గుండెపూడి గ్రామాల్లో సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఈ వర్షం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. ​కాగా గాలుల తీవ్రతకు జూలూరుపాడు – వినోబానగర్ మధ్య ప్రధాన రహదారిపై ఓ పెద్ద చెట్టు కూలిపడింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈదురు గాలుల బీభత్సం.. కూలిన టోల్ ప్లాజా పైకప్పు

మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలో భారీ ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ ఈదురు గాలులు వీచాయి. తీవ్రమైన గాలుల ధాటికి మేడపి గ్రామంలో ఉన్న టోల్ ప్లాజా పైకప్పు కూలిపోయింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ధర్మేంద్రకు పద్మవిభూషణ్

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు దశాబ్దాల కాలం పాటు సాటిలేని సేవలందించిన దిగ్గజ నటుడు, వెటరన్ యాక్టర్ ధర్మేంద్రను దేశం రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ధర్మేంద్ర సతీమణి, ప్రముఖ నటి హేమ మాలిని ఈ ప్రతిష్ఠాత్మక ‘పద్మవిభూషణ్’ అవార్డును స్వీకరించారు. ఆయన సాధించిన కీర్తి ప్రతిష్టలు ఈ అత్యున్నత పురస్కార రూపంలో శాశ్వతంగా నిలిచిపోతాయని కుటుంబ సభ్యులు […]

రేపు ఇక్కడ వడగాల్పులు-అక్కడ వర్షాలు..! జిల్లాల వారీగా..!

ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్టమంతా ఒకేలా ఎండలు కానీ, వర్షపాతం కానీ లేవు. ఇవాళ కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరులో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 48.1 డిగ్రీలు నమోదయ్యాయి. రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 – 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు, మరోవైపు ద్రోణి ప్రభావంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON