మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలో భారీ ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ ఈదురు గాలులు వీచాయి. తీవ్రమైన గాలుల ధాటికి మేడపి గ్రామంలో ఉన్న టోల్ ప్లాజా పైకప్పు కూలిపోయింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.