భారతీయ చలనచిత్ర పరిశ్రమకు దశాబ్దాల కాలం పాటు సాటిలేని సేవలందించిన దిగ్గజ నటుడు, వెటరన్ యాక్టర్ ధర్మేంద్రను దేశం రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అత్యంత వైభవంగా జరిగిన పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ధర్మేంద్ర సతీమణి, ప్రముఖ నటి హేమ మాలిని ఈ ప్రతిష్ఠాత్మక ‘పద్మవిభూషణ్’ అవార్డును స్వీకరించారు. ఆయన సాధించిన కీర్తి ప్రతిష్టలు ఈ అత్యున్నత పురస్కార
రూపంలో శాశ్వతంగా నిలిచిపోతాయని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.