ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ, ప్రొ.కే నాగేశ్వర్‌ను ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌లో అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తోందని… అదే జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై జనసేన పార్టీ, ఏపీ పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కేసుల పేరుతో
వేధింపులకు గురి చేస్తోందని “ఎక్స్” వేదికగా మండిపడ్డారు. ఈ విషయంలో కె. నాగేశ్వర్‌కు కవిత మద్దతు ప్రకటించారు.