్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అనంత శ్రీరామ్ తన ఫిర్యాదులో, తమ కుటుంబానికి చెందిన ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ భూ వివాదం కోర్టులో ఉన్నప్పటికీ, ఒత్తిళ్లు మాత్రం ఆగడం లేదని ఆయన వేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా తన తల్లిదండ్రుల భద్రతపై ఆందోళన చెందుతూ అధికారులను ఆశ్రయించడం, అనంత శ్రీరామ్ ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నారో చూపిస్తోంది.