నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై వాహన శ్రేణిలో టైర్ పేలి పోవడంతో ఒక్కసారిగా ట్రక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వెనుక వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కార్లకు యాక్సిడెంట్ అయింది. కార్ల వెనుక వచ్చిన కొబ్బరి బొండాల లారీ కార్లను పక్క నుండి ఢీ కొట్టుకుని పొలాల్లోకి దూసుకెళ్లింది.పలు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.