ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జనసేన పార్టీ నాయకుల పార్టీ నియమాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న తీరుపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌తో సహా, జిల్లా కార్యవర్గ సభ్యులతో కూడిన కమిటీ రద్దు తక్షణం అమలులోకి వస్తుంది. క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, పార్టీ నియమాలను దాటిన వారందరి నుంచి వివరణ తీసుకోవాలని కేంద్ర కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు.