loader

బిహార్ కొత్త సిఎంగా సమ్రాట్ ప్రమాణం

బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా నాయకుడు సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం లోక్ భవన్‌లో బీహార్ 21వ సిఎంగా చౌదరితో గవర్నర్ సయ్యద్ అత హస్నైన్ ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్‌కు మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా చౌదరి అయ్యారు. బిజెపి ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ వంటి కీలకమైన రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

హోర్ముజ్ దిగ్భంధం సంపూర్ణంగా అమలు: ప్ర‌క‌టించిన సెంట్ర‌ల్ క‌మాండ్‌

హోర్ముజ్ జ‌ల‌సంధిలో ఇరానీ పోర్టుల‌ను సంపూర్ణంగా దిగ్భంధించిన‌ట్లు అమెరికా సెంట్ర‌ల్ క‌మాండ్ పేర్కొన్న‌ది. పూర్తి స్థాయిలో నౌక‌ల రాక‌పోక‌ల‌ను బ్లాక్ చేసినట్లు సెంట్‌కామ్ అధినేత బ్రాడ్ కూప‌ర్ తెలిపారు. హోర్ముజ్ జ‌ల‌సంధి మార్గంలో జ‌రుగుతున్న ఆర్థిక వాణిజ్యాన్ని పూర్తిగా ఆపేసిన‌ట్లు అమెరికా మిలిట‌రీ పేర్కొన్న‌ది. అమెరికా ద‌ళాలు పూర్తి స్థాయిలో ఇత‌ర నౌక‌ల‌ను అడ్డుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

చంద్రబాబు సంచలన నిర్ణయం.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్

తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌ను నియమించింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో, జాతీయ కమిటీలను తెదేపా ప్రకటించింది. ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగనున్నారు. మొత్తం 29 మందితో పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేయగా.. 31 మందితో జాతీయ కమిటీని నియమించారు. అలాగే 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. జాతీయ కార్యదర్శులుగా ముగ్గురికి, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం ఇచ్చింది టీడీపీ.

ఇంటర్ ఫలితాలు విడుదల.. 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పాస్ పర్సంటేజ్ నమోదు

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 5,10,307 మంది, సెకండియర్‌లో 5,05,609 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత 12 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని  లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 92% ఉత్తీర్ణత నమోదైంది. అన్నమయ్య జిల్లాలో […]

180 మంది మైన‌ర్ల‌ను లైంగికంగా వేధించాడు.. 350 వీడియోలు తీశాడు..

మ‌హారాష్ట్ర అమ‌రావ‌తి జిల్లాలోని ప‌ర‌ట్వాడా లో మైన‌ర్ అమ్మాయిల‌ను లైంగికంగా వేధిస్తున్న మొహ‌మ్మ‌ద్ అయాజ్‌ అనే వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 180 మంది మైన‌ర్ అమ్మాయిల‌ను లైంగికంగా వేధించి,వారితో సుమారు 350 అస‌భ్య‌క‌ర వీడియోల‌ను షూట్ చేశాడు.ప్రేమ పేరుతో అత‌ను అమ్మాయిల‌ను ట్రాప్ చేసి వారిని ముంబై, పూణెకు తీసుకెళ్లేవాడు. అక్క‌డ అస‌భ్య‌క‌ర వీడియోల‌ను అత‌ను షూట్ చేసేవాడు. ఆ వీడియోల‌తో అత‌ను అమ్మాయిల‌ను బ్లాక్‌మెయిల్ చేసి వారిని వ్య‌భిచారంలోకి దించేవాడు. కొన్ని వీడియోల‌ను […]

జగన్‌ మాజీ CPRO పూడి శ్రీహరి అరెస్టు

జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు సీపీఆర్‌వోగా వ్యవహరించిన పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా శ్రీహరి పోస్టులు పెట్టించారు. చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి యానిమేషన్‌ పోస్టింగ్‌లు చేసినట్లు చిత్తూరులో కేసు నమోదైంది. దీంతో శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరి ప్రస్తుతం వైకాపా మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు

పడవ బోల్తా.. 250 మంది గల్లంతు

రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌ జాతీయులతో వెళ్తున్న పడవ అండమాన్‌ వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 250 మంది గల్లంతు అయ్యారు. దక్షిణ బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్‌ నుంచి బయలుదేరిన పడవ మలేషియాకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బలమైన గాలులు, అల్లకల్లోలమైన సముద్రం, సామర్థ్యానికి మించి ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికారులు రెస్య్కూ ఆపరేషన్‌ చేపట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON