ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 5,10,307 మంది, సెకండియర్‌లో 5,05,609 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత 12 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 92% ఉత్తీర్ణత నమోదైంది. అన్నమయ్య జిల్లాలో అత్యల్పం 62% ఉత్తీర్ణత శాతం నమోదైంది.

