జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీపీఆర్‌వోగా వ్యవహరించిన పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా శ్రీహరి పోస్టులు పెట్టించారు. చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి యానిమేషన్ పోస్టింగ్‌లు చేసినట్లు చిత్తూరులో కేసు నమోదైంది. దీంతో శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరి ప్రస్తుతం వైకాపా మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు

