తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నలుగురు పర్మినెంట్ జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం ఏప్రిల్ 14న సమావేశమై ఈ మేరకు ఖరారు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జస్టిస్ యారా రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు, జస్టిస్ తిరుమలదేవి, జస్టిస్ బీఆర్ మధుసూధనావు అదనపు జడ్జీలుగా కొనసాగుతున్నారు. వీరినే పర్మినెంట్ జడ్జీలుగా చేయాలని కోలీజియం నిర్ణయించింది. రాష్ట్రపతి అప్రూవల్ చేయడంతో అధికారికంగా గెజిట్ జారీ కానున్నది.

