loader

నియోజకవర్గాల పునర్విభజనకు హైబ్రీడ్ మోడల్ పరిశీలించండి – ప్రధాని మోదీకి రేవంత్ లేఖ

లోక్‌సభ సీట్లను జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ మోడల్ ను ప్రతిపాదించారు . దీని ప్రకారం పెంచబోయే అదనపు సీట్లలో 50 శాతం సీట్లను జనాభా ప్రాతిపదికన కేటాయించాలి . మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల ఆర్థిక సహకారం , సామాజిక అభివృద్ధి […]

పవర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలుడు.. 9 మంది కార్మికులు మృతి, 30 మందికి తీవ్ర గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. పవర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలుడు సంభవించి, 9 మంది కార్మికులు మృతి చెందారు. శక్తి జిల్లా, సింగితరాయ్‌లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలుడు సంభవించడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 30 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా, వారిలో తొమ్మిది మంది చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను […]

బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి – డిప్యూటీ సీఎంగా నితీష్ తనయుడు

బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగిసింది. నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్‌లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరబోతోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరిని తమ నేతగా బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేడీయూ కోటాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వారిలో ఒకరు నితీష్ కుమారుడు ఉండనున్నారు.

తొలి ‘క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభించిన చంద్రబాబు

ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ’ని అత్యాధునిక సదుపాయాలను మంగళవారం ప్రారంభించారు.ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ‘1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ’ని ప్రారంభించారు. గన్నవరంలోని మేధా టవర్స్ ఇక్కడ ఉన్న ‘1క్యూ క్వాంటం ఫెసిలిటీ’ని జాతికి అంకితం చేశారు. ఈ రెండు కేంద్రాలు క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించే టెస్ట్ బెడ్స్‌గా పనిచేస్తాయి. ఈ కొత్త సదుపాయాల వల్ల  క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను పరీక్షించి, సర్టిఫై […]

వినతిపత్రాన్ని విసిరికొట్టి.. సిఐటియు నేతలపై జనసేన ఎమ్మెల్యే ఆగ్రహం !

విశాఖపట్నంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నైట్ ఫుడ్ కోర్ట్ పునఃప్రారంభించాలని కోరుతూ వినతిపత్రం అందజేయడానికి వచ్చిన సిఐటియు నేతల విన్నపాన్ని స్వీకరించడానికి నిరాకరించిన వంశీకృష్ణ, ఆగ్రహంతో వినతిపత్రాన్ని కమ్యూనిస్టు నేతలపైకి విసిరికొట్టారు. గత కొన్ని రోజులుగా నైట్ ఫుడ్ కోర్టును మూసివేయడంతో ఉపాధి కోల్పోయిన బాధితులు, వారికి మద్దతుగా సిఐటియు నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ప్రజాప్రతినిధి ఇలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని బాధితులు ఆవేదన వ్యక్తం […]

‘నారీ శక్తి వందన్’కు సంపూర్ణ మద్దతు కోరిన చంద్రబాబు.. అన్ని పార్టీలకు లేఖలు

‘నారీ శక్తి వందన్’ చట్టానికి బేషరతుగా మద్దతు పలకాలని కోరుతూ ఆయన వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులకు వ్యక్తిగత లేఖలు రాశారు ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లును ఏకగ్రీవంగా బలపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆయన లేఖలు పంపారు.

డీలిమిటేషన్‌పై సీఎం స్టాలిన్‌ కేంద్రానికి వార్నింగ్‌

నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదించాలని కేంద్రం భావిస్తోందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ లో బిల్ పాస్ చేస్తే భారీ ఎత్తున ఉద్యమం చేపడుతామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. డీలిమిటేషన్‌పై తాము మొదట్నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నామని, దీనివల్ల నష్టపోతున్న రాష్ట్రాలు ఏకమై చెన్నైలో సమావేశం నిర్వహిస్తామని స్టాలిన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక వీడియోను విడుదల చేశారు.

నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో! కార్మికుల తలలకు కెమెరాలు ఎందుకు

ఇండియాటుడే కథనం ప్రకారం.. వైరల్ వీడియోలు, పోస్టులను పరిశీలిస్తే.. కొంతమంది వర్కర్స్ గార్మెంట్ యూనిట్లలో వరుసలుగా కూర్చుని బట్టలు కుట్టడం, ఫ్యాబ్రిక్‌ను సర్దడం వంటి పనులు చేస్తూ కనిపిస్తారు. అయితే వారి తలకు కెమెరాలు ఫిక్స్ చేసి ఉన్నాయి. కెమెరాలు కార్మికుడు చూసే ప్రతీ అంశాన్ని, ముఖ్యంగా చేతి కదలికలు, పని చేసే విధానాన్ని పూర్తిగా రికార్డ్ చేస్తాయి. ఈ డేటా, మెషీన్లకు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈ ఫుటేజ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ట్రైనింగ్ కోసం […]

ఏజెన్సీలోకి మళ్లీ ‘పెద్దపులి’ ఎంట్రీ.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట !

ఏలూరు ఏజెన్సీలో సుమారు 70 రోజుల క్రితం భారీ ఆపరేషన్ చేపట్టి బంధించిన రెస్క్యూ టీమ్‌ పులిని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే, ఇప్పుడు అదే పులి మళ్లీ జనారణ్యంలోకి ప్రవేశించడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.ఈ పులి కదలికలు చాలా విచిత్రంగా ఉన్నాయి. పగటిపూట వెదురు పొదల్లో సేదతీరుతూ ‘రెస్ట్’ తీసుకుంటున్న పులి, రాత్రి వేళల్లో అటవీ మార్గాల గుండా ప్రయాణిస్తోంది. తాజాగా పోలవరం జిల్లా మంటూరు వద్ద గోదావరి దాటిన పులి, వాడపల్లి-కొత్తూరు ప్రాంతంలోకి ప్రవేశించింది.

టీవీలో జన నాయగన్ ఫుల్ మూవీ! – రియాక్ట్ అయ్యే లోపే…

ఓవైపు సోషల్ మీడియాలో పైరసీపై విచాారణ సాగుతుండగానే , కోయంబత్తూరు సమీపంలోని కరుమత్తంపట్టిలో కేబుల్ టీవీ నెట్వర్క్ నిర్వహిస్తోన్న పళనిసామి అనే వ్యక్తి తన లోకల్ ఛానల్‌లో ఈ నెల 11న రాత్రి ‘జన నాయగన్’ ప్రసారం చేశారు. ఇంకా థియేటర్లలోకి రాని మూవీ టీవీల్లో వస్తుండడం చూసి అంతా షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న టీవీకే కార్యకర్తలు టెలికాస్ట్ నిలిపేయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఛానెల్ యజమానిని అరెస్ట్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON