విశాఖపట్నంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నైట్ ఫుడ్ కోర్ట్ పునఃప్రారంభించాలని కోరుతూ వినతిపత్రం అందజేయడానికి వచ్చిన సిఐటియు నేతల విన్నపాన్ని స్వీకరించడానికి నిరాకరించిన వంశీకృష్ణ, ఆగ్రహంతో వినతిపత్రాన్ని కమ్యూనిస్టు నేతలపైకి విసిరికొట్టారు. గత కొన్ని రోజులుగా నైట్ ఫుడ్ కోర్టును మూసివేయడంతో ఉపాధి కోల్పోయిన బాధితులు, వారికి మద్దతుగా సిఐటియు నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ప్రజాప్రతినిధి ఇలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

