మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని పరట్వాడా లో మైనర్ అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్న మొహమ్మద్ అయాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 180 మంది మైనర్ అమ్మాయిలను లైంగికంగా వేధించి,వారితో సుమారు 350 అసభ్యకర వీడియోలను షూట్ చేశాడు.ప్రేమ పేరుతో అతను అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని ముంబై, పూణెకు తీసుకెళ్లేవాడు. అక్కడ అసభ్యకర వీడియోలను అతను షూట్ చేసేవాడు. ఆ వీడియోలతో అతను అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేసి వారిని వ్యభిచారంలోకి దించేవాడు. కొన్ని వీడియోలను ఆన్‌లైన్‌లో కూడా షేర్ చేశాడు.

