తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌ను నియమించింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో, జాతీయ కమిటీలను తెదేపా ప్రకటించింది. ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగనున్నారు. మొత్తం 29 మందితో పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేయగా.. 31 మందితో జాతీయ కమిటీని నియమించారు. అలాగే 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. జాతీయ కార్యదర్శులుగా ముగ్గురికి, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం ఇచ్చింది టీడీపీ.

