హోర్ముజ్ జలసంధిలో ఇరానీ పోర్టులను సంపూర్ణంగా దిగ్భంధించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. పూర్తి స్థాయిలో నౌకల రాకపోకలను బ్లాక్ చేసినట్లు సెంట్‌కామ్ అధినేత బ్రాడ్ కూపర్ తెలిపారు. హోర్ముజ్ జలసంధి మార్గంలో జరుగుతున్న ఆర్థిక వాణిజ్యాన్ని పూర్తిగా ఆపేసినట్లు అమెరికా మిలిటరీ పేర్కొన్నది. అమెరికా దళాలు పూర్తి స్థాయిలో ఇతర నౌకలను అడ్డుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

