loader

విష వాయువులతో వందల కుటుంబాల తరలింపు

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా కేందౌది బస్తీ ప్రాంతం స్థానిక బొగ్గు గనుల నుంచి అకస్మాత్తుగా బయటకు రావడం ప్రారంభించిన విష వాయువులు వలన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, మరో 12 మంది ఆరోగ్యం దెబ్బతినడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచింది. గని ప్రాంతంలో విషరసాయనాల స్థాయి పెరుగుతున్న నేపథ్యంలో 1,000 మందికి పైగా నివాసితులను సమీపంలోని రక్షిత ప్రాంతాలకు తరలించారు. బొగ్గు గనుల్లో సుదీర్ఘకాలంగా పేరుకుపోయిన మీథేన్ మరియు ఇతర హానికర వాయువులు గనుల లోతుల్లో ఒత్తిడి పెరగడంతో బయటకు పొంగి రావడం ప్రారంభించినట్టు అనుమానం.

ఓటర్లకు బిందెలు పంచుతూ అడ్డంగా దొరికిన సర్పంచ్ అభ్యర్థి

కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, కన్కల్ గ్రామంలో  పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు బిందెలు  పంచుతూ దొరికిన సర్పంచ్ అభ్యర్థి పోలీసులకు పట్టుబడ్డాడు. గురువారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేస్తూ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన మద్దతుదారులు ఓటర్లను ప్రభావితం చేయడానికి బిందెలు పంచుతున్నారు. సరైన సమాచారంతో ఎన్నికల స్పెషల్ టీం సభ్యులు దాడి చేసి 41 బిందెలను స్వాధీనం  చేసుకున్నారు.  అభ్యర్థులు ఎవరైనా మద్యం, డబ్బు, ఇతర వస్తువులను పంపిణీ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని,  చట్టపరంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారని […]

పోలీస్ బాస్‌గా టీమిండియా స్టార్.. సిలిగురి ఏసీపీగా నియామకం..!

వరల్డ్ ఛాంపియన్ రీచా ఘోష్‌కు ఇచ్చిన మాటను బెంగాల్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. విశ్వ విజేతగా  తిరిగొచ్చిన రీచాకు డీఎస్పీ (DSP) హోదాను కట్టబెట్టింది. యావత్ దేశం, రాష్ట్రం గర్వించేలా చేసిన టీమిండియా స్టార్‌ను సిలిగురి ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా)గా నియమించారు. బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ సమక్షంలో గురువారం రీచా బాధ్యతలు స్వీకరించింది. ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో కీలకమైన రీచాకు స్వరాష్ట్రం బెంగాల్‌లో ఘన స్వాగతంతో పాటు ఊహించని పదవి దక్కింది.

థ్యాంక్ యూ సార్.. పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆనం ప్రశంసలు

ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ  మంత్రి పవన్ కళ్యాణ్ పై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  ప్రశంసలు కురిపించారు. గ్రామీణ వ్యవస్థను మెరుగు పరుస్తూ గ్రామాల్లో   మెరుగైన రోడ్డు, తాగు నీటి సౌకర్యం, మెరుగైన ఆరోగ్యం, ఇతర మౌలిక వసతులు అందిస్తున్నారన్నారు. ఈ ప్రయాణంలో తామంతా వెంట నడుస్తామని తెలిపారు. రాష్ట్రంలో 77 డీడీఓ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఆనం మాట్లాడారు.

పుతిన్ కోసం ఢిల్లీ ఐటీసీ మౌర్య హోటల్‌లో చాణక్య సూట్.. ఒక్క రాత్రికే అన్ని లక్షలా?

పుతిన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీలో ల్యాండ్ కాగానే..  ఐటీసీ మౌర్య హోటల్‌ చేరుకోనున్నారు. ఈ ఐటీసీ మౌర్య హోటల్‌లో  అత్యంత లగ్జరీ కలిగిన చాణక్య సూట్‌ను.. పుతిన్ కోసం రెడీ చేశారు. ఈ సూట్ 4,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.  ఈ చాణక్య సూట్‌కు ఒక రాత్రి అద్దె రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా.విలాసవంతమైన విల్లెరాయ్ అండ్ బోక్ క్రాకరీ, క్రిస్టల్ డి […]

అమరావతి నిర్మాణానికి రూ.7,380 కోట్ల రుణం – సీఆర్డీఏ సమావేశం ఆమోదం

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ  అథారిటీ సమావేశంలో వివిధ కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు రూ.169 కోట్లతో లోక్ భవన్, జ్యుడిషియల్ అకాడమీ రూ.163 కోట్లతో అనుమతులకు ఆమోదం తెలిపారు.  నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి రూ.7,380.70 కోట్లు రుణం తీసుకునేందుకు అంగీకారం తెలిపారు.  సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి  అనుసంధించే పనులకు రూ.532 కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు. 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు ఆమోదించారు.

‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్

 ‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్ ను తీర్చిదిద్దేలా తమ   ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ’లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ‘ని రూపొందించామన్నారు.  గచ్చిబౌలిలోని ‘ఐఐఐటీ హైదరాబాద్‘లో ‘నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం అండ్ తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ’ని   గురువారం డిప్యూటీ సీఎం భట్టి […]

ఎర్రబస్సే కాదు,ఎయిర్ బస్సును ఆదిలాబాద్‌కు తెస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్‌కు ఎర్రబస్సే కాదు ఎయిర్ బస్సును కూడా తీసుకువస్తాం  అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలోని వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇఛ్చారు.  ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు, చనాక – కొరాట ప్రాజెక్టు,  విమానాశ్రయం, విశ్వవిద్యాలయం ఏర్పాటు,  సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వంటి కీలకమైన […]

అమరావతి పనులపై జగన్‌కు అవగాహన లేదు.. మంత్రి నారాయణ

 రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అవగాహన లేదని.. ఇక్కడకు వచ్చి చూస్తే ఆ పనులు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు.అవగాహన లేకుండా అమరావతి గురించి తమ ప్రభుత్వాన్ని జగన్ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. భూ సమీకరణకు, సేకరణకు కూడా జగన్‌కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. రాజధాని పనులను ముందుగా తెలుసుకుని.. ఆ తర్వాత ఆయన మాట్లాడాలని హితవు పలికారు.

ఒకే కారులో ప్రయాణించిన మోడీ, పుతిన్.. వీడియో..!

 ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగిన పుతిన్‌ను ఆలింగనం చేసుకొని వెల్‌కమ్ చెప్పారు మోడీ.  అనంతరం ఇరువురు రెడ్‌కార్పెట్‌పై నడుస్తూ అధికారులను   పరిచయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత ఇరువురు నృత్యకారుల ప్రదర్శనను వీక్షించారు.    అక్కడే ఏర్పాటు   చేసిన అధికారిక టయోటా ఫార్చునర్ వాహనంలో  మోడీ, పుతిన్ విమానాశ్రయం నుంచి ప్రధాని అధికారిక నివాసానికి బయల్దేరి వెళ్లారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON