ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగిన పుతిన్‌ను ఆలింగనం చేసుకొని వెల్కమ్ చెప్పారు మోడీ. అనంతరం ఇరువురు రెడ్‌కార్పెట్‌పై నడుస్తూ అధికారులను పరిచయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత ఇరువురు నృత్యకారుల ప్రదర్శనను వీక్షించారు. అక్కడే ఏర్పాటు చేసిన అధికారిక టయోటా ఫార్చునర్ వాహనంలో మోడీ, పుతిన్ విమానాశ్రయం నుంచి ప్రధాని అధికారిక నివాసానికి బయల్దేరి వెళ్లారు.

