రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అవగాహన లేదని.. ఇక్కడకు వచ్చి చూస్తే ఆ పనులు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు.అవగాహన లేకుండా అమరావతి గురించి తమ ప్రభుత్వాన్ని
జగన్ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. భూ సమీకరణకు, సేకరణకు కూడా జగన్‌కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. రాజధాని పనులను ముందుగా తెలుసుకుని.. ఆ తర్వాత ఆయన మాట్లాడాలని హితవు పలికారు.

