ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా కేందౌది బస్తీ ప్రాంతం స్థానిక బొగ్గు గనుల నుంచి అకస్మాత్తుగా బయటకు రావడం ప్రారంభించిన విష వాయువులు వలన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, మరో 12 మంది ఆరోగ్యం దెబ్బతినడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచింది. గని ప్రాంతంలో విషరసాయనాల స్థాయి పెరుగుతున్న నేపథ్యంలో 1,000 మందికి పైగా నివాసితులను సమీపంలోని రక్షిత ప్రాంతాలకు తరలించారు. బొగ్గు గనుల్లో సుదీర్ఘకాలంగా పేరుకుపోయిన మీథేన్ మరియు ఇతర హానికర వాయువులు గనుల లోతుల్లో ఒత్తిడి పెరగడంతో బయటకు పొంగి రావడం ప్రారంభించినట్టు అనుమానం.

