కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, కన్కల్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు బిందెలు పంచుతూ దొరికిన సర్పంచ్ అభ్యర్థి పోలీసులకు పట్టుబడ్డాడు. గురువారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేస్తూ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన మద్దతుదారులు ఓటర్లను ప్రభావితం చేయడానికి బిందెలు పంచుతున్నారు. సరైన సమాచారంతో ఎన్నికల స్పెషల్ టీం సభ్యులు దాడి చేసి 41 బిందెలను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థులు ఎవరైనా మద్యం, డబ్బు, ఇతర వస్తువులను పంపిణీ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని, చట్టపరంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు

