loader

భారత్‌నే లక్ష్యంగా చేసుకున్న ఓపెన్‌ఏఐ..నియామకాలు ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) విప్లవానికి మార్గదర్శకంగా నిలిచిన చాట్‌జీపీటీ మాతృసంస్థ OpenAI ఇప్పుడు భారత మార్కెట్‌పై దృష్టి సారించింది. ఈ ఏడాది ఆగస్టులో ఓపెన్‌ఏఐ అధికారికంగా భారత్‌లో బ్రాంచ్‌ ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం సొల్యూషన్‌ ఇంజనీర్‌ల నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. బెంగళూరును కేంద్రంగా చేసుకుని, భారత డెవలపర్‌ కమ్యూనిటీలతో సంబంధాలను బలోపేతం చేయడం, టెక్నాలజీ భాగస్వామ్యాలను పెంచడం సంస్థ తదుపరి లక్ష్యమని చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ నారాయణన్‌ వివరించారు.

బిహార్ ఎన్నికల ప్రభావం -హైదరాబాద్‌లో పనులు మందగింపు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే దాదాపు 8 లక్షల మంది బిహార్ వలస కార్మికులు పనిచేస్తున్నారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగానికి చెందినవారే. కొందరు హోటల్స్, రోడ్ వర్క్స్, మరియు చిన్న చిన్న వ్యాపార రంగాల్లోనూ ఉన్నారు. ఎన్నికల కారణంగా వీరు దాదాపు 10 రోజులపాటు గైర్హాజరు అవుతారని అంచనా. ఫలితంగా ప్రాజెక్టులు ఆలస్యమవుతాయి, కాంట్రాక్టర్లకు అదనపు వ్యయం వస్తుంది.

లేఆఫ్ బాటలో మరో సంస్థ

ఐబీఎం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.7 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. “సింగిల్ డిజిట్ 1%” ఉద్యోగులను తగ్గించే యోచనలో ఉందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. అంటే కనీసం 2,700 మందికి ఉద్యోగ భయం తప్పదన్న మాట. ఈ నిర్ణయం కృత్రిమ మేధస్సు ప్రాజెక్టులు, ఆటోమేటెడ్ సిస్టమ్‌లు, మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పై సంస్థ దృష్టి పెరగడం వల్లనే తీసుకున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి వెలుగుల్లో ప్రదోషకాలంలో శ్రీ దుర్గా మల్లేశ్వరులకు దీపోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. దేవస్థానంలో జ్వాలాతోరణం ఘనంగా నిర్వహించారు. కనక దుర్గమ్మకు పంచహారతులు అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమల్లేశ్వర అమ్మవారి సన్నిధిలో మహిళలు పెద్ద సంఖ్యలో కార్తిక దీపాలు వెలిగించారు. ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.

శ్రీశైలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు..వైభవంగా జ్వాలాతోరణం

ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ఎదుట గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు. నూలు పోగువొత్తులను ప్రకాశం జిల్లా వేటపాలం మండలం ఆమోదగిరిపట్నంకి చెందిన వసుందరరావు కుటుంబీకులతో వచ్చి ఆలయానికి అప్పగించడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు. ఈ జ్వాలాతోరణోత్సవాన్ని తిలకించి భస్మాన్ని నుదుటిన ధరించడంతో సకల గ్రహపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి:సీఎం రేవంత్ ఫైర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు షేక్‌పేట డివిజన్, పారామౌంట్ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత, కిషన్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత ఎమ్మెల్యే పీజేఆర్ చనిపోయినప్పుడు సెంటిమెంట్ లేదని కేసీఆర్ అన్నారని, పీజేఆర్ కుటుంబాన్ని కేసీఆర్ ఆనాడు అవమానించారని, అందుకే పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏపీ వ్యాప్తంగా కార్తికపౌర్ణమి వేడుకలు – శివనామస్మరణతో మార్మోగిన శైవాలయాలు

కార్తిక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. భక్తులతో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణలో తరించారు. కార్తిక పౌర్ణమి వేళ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పంచారామాల్లో ఒకటైన అమరావతి బాల చాముండీ సహిత అమరలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రమైన భీమవరం సోమేశ్వరస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి.

ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టుకి ప్రధాని మోదీ ఘన సన్మానం..

మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టును ప్రధాని మోదీ బుధవారం సన్మానించారు. వరల్డ్ కప్ విశేషాలను టీమ్ఇండియా క్రీడాకారిణులు మోదీతో పంచుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మహిళల ప్రపంచ కప్ విజేత జట్టును ఆతిథ్యం ఇచ్చారు. ప్రధాన మంత్రి మహిళా క్రీడాకారిణులను ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని దేశవ్యాప్తంగా యువతిలోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే, వారు చదివిన పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను ప్రేరేపించాలని […]

బీజేపీ నాయకురాలి ‘సెక్స్‌ రాకెట్‌’ గుట్టురట్టు..ఆర్జేడీ మండిపాటు

బీజేపీ నాయకురాలి ‘సెక్స్‌ రాకెట్‌’ గుట్టురట్టయ్యింది. ఒక మీడియా సంస్థ స్టింగ్‌ ఆపరేషన్‌లో సంచలన విషయాలు ఆమె బయటపెట్టింది. నేతల వద్దకు అమ్మాయిలను పంపుతున్నట్లు చెప్పింది. బీహార్ ఎన్నికల్లో కేంద్ర నాయకత్వం తనకు పెద్ద బాధ్యత అప్పగించినట్లు వెల్లడించింది. జార్ఖండ్‌ బీజేపీ ఎస్టీ మోర్చా నాయకురాలు ఫూల్ జోషి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘జై బీజేపీ, విజయ్ బీజేపీ’ ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. ‘దైనిక్ భాస్కర్’ ఆమెపై స్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది.

సజ్జల బాధ్యతలపై జగన్ కీలక నిర్ణయం

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాల తీసుకుంటున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, ఆ పార్టీ సోషల్ మీడియా మాజీ ఇంఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి జగన్ కొత్త బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో భార్గవరెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. ఏడాది ఆగస్టులో పార్టీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి భార్గవ రెడ్డిని తప్పించారు. ఇప్పుడు భార్గవ రెడ్డికి సాక్షి మీడియాలో డిజిటల్ హెడ్ గా నియమిస్తూ తాజాగా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON