తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనే దాదాపు 8 లక్షల మంది బిహార్ వలస కార్మికులు పనిచేస్తున్నారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగానికి చెందినవారే. కొందరు హోటల్స్, రోడ్ వర్క్స్, మరియు చిన్న చిన్న వ్యాపార రంగాల్లోనూ ఉన్నారు. ఎన్నికల కారణంగా వీరు దాదాపు 10 రోజులపాటు గైర్హాజరు అవుతారని అంచనా. ఫలితంగా ప్రాజెక్టులు ఆలస్యమవుతాయి, కాంట్రాక్టర్లకు అదనపు వ్యయం వస్తుంది.

