కార్తీక పౌర్ణమి వెలుగుల్లో ప్రదోషకాలంలో శ్రీ దుర్గా మల్లేశ్వరులకు దీపోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. దేవస్థానంలో జ్వాలాతోరణం ఘనంగా నిర్వహించారు. కనక దుర్గమ్మకు పంచహారతులు అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమల్లేశ్వర అమ్మవారి సన్నిధిలో మహిళలు పెద్ద సంఖ్యలో కార్తిక దీపాలు వెలిగించారు. ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.

